KNR: మానకొండూరు నియోజకవర్గం గూడెం గ్రామంలోని 35 మంది దళితులకు సంబంధించిన భూసమస్య పరిష్కారానికి మానకొండూర్ MLA కవ్వంపల్లి సత్యనారాయణ ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఈ గ్రామ పరిధిలో గల 63.18 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి 35 మంది లబ్ధిదారులకు భూమి రిజిస్ట్రేషన్ చేశారు. 8 ఏళ్లుగా మ్యుటేషన్ కాక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.