PDPL: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్.ఎస్.సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి జి.శారద శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 20-27 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు www.telanganaopenschool.org లేదా మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా హాల్ టికెట్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.