NLG: చిట్యాల మున్సిపాలిటీ 6వ వార్డు వెంకటాపురం రైతులకు ఊరటనిస్తూ, నకిరేకల్ ఎమ్మెల్యే చొరవతో గ్రామంలో మొదటిసారిగా నూతన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఇవాళ మార్కెట్ ఛైర్పర్సన్ నర్రా వినోద ప్రారంభించారు. గతంలో రైతులు చిట్యాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై గ్రామంలోనే సులువుగా పంటను అమ్ముకోవచ్చని తెలిపారు.