KMR: బిచ్కుందలోని కందర్పల్లిలో నిన్న నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో బాన్సువాడ డివిజన్‌కు చెందిన సింధు స్వర్ణ పతకం సాధించింది.100 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విజేతలు ఈనెల 9 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని KMR జిల్లా రెజ్లింగ్ అధ్యక్షుడు వినోద్ కోరారు.