VKB: ధారూర్ మండలంలోని పల్లెపల్లెనా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతూ ఏరులై పారుతోంది. అనుమతి లేని బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెల్లువెత్తడంతో సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రతి చిన్న కిరాణా షాపులోనూ మద్యం అందుబాటులో ఉండటంతో యువత విపరీతంగా వ్యసనాలకు బానిసవుతున్నారు. అధికారులు అక్రమ విక్రయాలు పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.