NRML: గురువారం నిర్మల్ పట్టణం గాజులపేటలో చిలుకల చిన్నమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.