GDWL: జనగణన 2027లో భాగంగా ఇంటింటి గణనను జూన్ 9లోగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం గద్వాల కలెక్టరేట్ ఆయన మాట్లాడుతూ భూభారతి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన నిఘా ఉంచాలని సూచించారు. రేషన్ దుకాణాల తనిఖీలు తరచూ చేయాలని, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.