KMM: ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో జరిగిన భారీ అగ్నిప్రమాద స్థలాన్ని సీఐ మురళి ఆదేశాల మేరకు ఎస్సై హరిత శుక్రవారం పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ప్రమాద తీవ్రత, నష్టపోయిన ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట వ్యర్థాలకు నిప్పంటించి ప్రమాదానికి కారణమైన వారిపై పూర్తి విచారణ జరపాలని రైతులు కోరారు.