AP: ఉష్ణోగ్రతలు ఇవాళ్టి నుంచి స్వల్పంగా తగ్గనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ 11 మండలాల్లో తీవ్రవడగాలులు, 64 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45-46 డిగ్రీలు, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూ.గో., ప.గో., NTR జిల్లాల్లో 43-45, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో 40-42 డిగ్రీలు నమోదు కానున్నట్లు సూచించింది.