నల్గొండ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి 1-10వ తరగతి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయానికి బుక్ షాపుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. ఆసక్తి గలవారు బుక్ షాపు రిజిస్ట్రేషన్, ఆధార్, పాన్, జీఎస్టీ పత్రాలు, మూడేళ్ల ఐటీ రిటర్న్స్, రూ. 3500 డీడీతో జూన్ 5లోగా కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.