HNK: అంగన్వాడీ కార్యకర్తల సేవలు సమాజానికి అమూల్యమైనవని, వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ కడియం కావ్య అన్నారు. అంగన్వాడీ టీచర్లతో ఎంపీ సమావేశమై మాట్లాడుతూ.. గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలకు పోషకాహారం అందించడంతో పాటు పుట్టిన చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యలో వారు అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు.