TG: మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయాలని మంత్రి సీతక్కను రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఏక మొత్తంలో బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 250 మంది ఉద్యోగుల, ఉపాధ్యాయుల బకాయిలు రాక అనారోగ్యంతో ప్రాణాలు వదిలారని చెప్పారు.