పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఆ జట్టు ప్లేయర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2019 నుంచి ఆ జట్టులో ఉన్న ప్రభ్సిమ్రాన్ మాట్లాడుతూ.. ‘మా జట్టుకు ఏ కెప్టెన్ వచ్చినా నా ఫేవరేట్ కెప్టెన్ శ్రేయస్. అతడు నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటున్నాడు. నేను కొన్ని మ్యాచ్‌లు సరిగ్గా ఆడకపోయినప్పటికీ ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని చెప్పేవాడు’ అని అన్నాడు.