పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితులు, దేశీయ సవాళ్ల నేపథ్యంలో భారత వృద్ధి రేటును వరల్డ్ బ్యాంక్ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన ఆర్థికవ్యవస్థ 6.6 శాతం మేర వృద్ధిని సాధించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత పరిస్థితుల మధ్య దేశ వృద్ధి రేటు ప్రతికూల దిశలో ఉందని వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది.