పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిబ్బందిలో ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుండగా.. టెంట్స్, ఇతర సామాగ్రి పాక్షికంగా కాలిపోయాయి. అయితే.. ఈ సెట్లో ప్రభాస్ లేరని సమాచారం. కాగా, సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.