TG: తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ కన్నుముశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బాన్సువాడలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులైన ఆమె, మహిళా లోకం సమస్యలపై నిరంతరం గొంతెత్తారు.