NRML: రైతుల అభివృద్ధి, శ్రేయస్సే భారతీయ కిసాన్ సంఘ్ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనంద్ రావు తెలిపారు. ముధోల్లో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, రైతుల సమస్యలపై చైతన్యం కల్పిస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం, అగ్ని ప్రమాదాలు, పశువుల దొంగతనాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.