ADB: ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల నెరవేరిందని ఆత్మ ఛైర్మన్ గొర్ల రాజు యాదవ్ అన్నారు. బోథ్ మండల కేంద్రంలోని సాయి నగర్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడిచిన 10 సంవత్సరాల BRS పరిపాలనలో ఏ ఒక్కరికి లబ్ధి చేకూరలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అందరికీ సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.