KKRతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో LSG విజయంలో ముకుల్ చౌదరి కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి 27 బంతుల్లో 54* పరుగులు (7 సిక్సర్లు, 2 ఫోర్లు) చేసి జట్టును గెలిపించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ముకుల్ చౌదరిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.