MNCL: మంచిర్యాలలో శుభ్రత- ప్రతి ఒక్కరి భద్రత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ డివిజన్లో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.