KRNL: ఎమ్మిగనూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.