NRML: నిర్మల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్ రెడ్డి శనివారం మొక్కజొన్న రైతులకు టోకెన్లు జారీ చేశారు. రబీ సీజన్లో పండించిన మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా సూచించారు. నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.