TG: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వెంకరామపురంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.