‘కొత్త లోక’లో మమ్ముట్టి వాయిస్ ఇచ్చిన మూతోన్ పాత్ర వెనుక ఒక ఫన్నీ స్టోరీ ఉంది. దీనిపై మమ్ముట్టి మాట్లాడుతూ.. ‘దుల్కర్ స్వయంగా రాకుండా తన మేనేజర్‌తో వాయిస్ అడిగించాడు. నేను కేవలం వద్దు అని ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పాను. కానీ రిలీజ్ అయ్యాక ఆ వాయిస్, చేయి నావేనని ప్రకటించి నన్ను మోసం చేసి ఈ పాత్రలో ఇరికించారు. ఇప్పుడు పార్ట్-2లో నటించాల్సిన బాధ్యత నాపై పడింది’ అని అన్నాడు.