HNK: హోమియోపతి దినోత్సవం, ఆయుష్ డే సందర్భంగా వడ్డేపల్లి పార్కులో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా వైద్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య యోగ కార్యక్రమానికి హాజరయ్యారు. యోగ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచనలు చేశారు. స్థానిక కార్పొరేటర్ అభినవ భాస్కర్, తదితరులున్నారు.