RR: న్యాయవాదుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి, పట్టణ న్యాయవాద బార్ అసోసియేషన్ అభివృద్ధికి సహకారాలు ఉంటాయన్నారు.