SKLM: జిల్లాలో మాంసం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించింది. చికెన్ ధరలు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం స్కిన్‌తో కూడిన చికెన్ కేజీ రూ.213, స్కిన్ లెస్ చికెన్ రూ.243గా ఉంది. నాటుకోడి రూ.700, పొట్టేలు మాంసం రూ.1000కి విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు.