VKB: పాడి గేదెల పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగించబడినట్లు పశు వైద్య శాఖ కొడంగల్ సహాయ సంచాలకులు డాక్టర్ నోహ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన రైతులు ఈ నెల 23లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు కాపీని మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు.