WNP: రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబ యజమాని (18-60 ఏళ్ల వయసు) అకస్మాత్తుగా మృతి చెందితే బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తారు. ఇందుకోసం గ్రామాల్లో గ్రామ పంచాయతీ, పట్టణాల్లో పుర అధికారికి దరఖాస్తు చేసుకోవాలి అని డీఆర్డీఓ ఉమాదేవి తెలిపారు. అందులోని వివరాలు సరైనవిగా భావిస్తే అధికారులు రూ.20 వేలు ఆర్థిక సాయం 10 రోజుల్లోనే అందజేస్తారని అన్నారు.