MBNR: మహబూబ్నగర్ ప్రభుత్వ అంధుల ఆశ్రమ కళాశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాములు తెలిపారు. 6-14 ఏళ్ల వయస్సు, 40 శాతం అంధత్వం ఉన్న విద్యార్థులు అర్హులు. ఉచిత వసతి, భోజనం, 4 జతల దుస్తులు అందజేస్తారు. వివరాలకు 96182 43794ను సంప్రదించాలని సూచించారు.