AP: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ విజయవాడలోని పటమట హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన అక్కడే అల్పాహారం చేయనున్నారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్లను ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తీసుకువస్తోంది. సీఎం రాకతో పటమటలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.