BHNG: షెడ్యూల్డు కులాల కార్యాచరణ పథకం 2025- 26 కింద రెండు పాడి గేదెల మంజూరు కోసం ఈ నెల 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని చౌటుప్పల్ పురపాలిక కమిషనర్ గుత్తా వెంకట్రామ్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. అర్హులైన షెడ్యూల్డు కులాల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని సంబంధిత పత్రాలను తమ కార్యాలయంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు.