సంగారెడ్డి మల్కాపూర్ చింతల్ వద్ద వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో పల్టీ కొట్టి రవి, హబీబ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది స్రవంతి, రవీందర్ లాల్ క్షేత్రస్థాయిలో ప్రథమ చికిత్స అందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.