TG: రాష్ట్రంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఇవాళ్టి నుంచి సంక్షేమ వారోత్సవాలు నిర్వహించనుంది. ఈనెల 26 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయి. ఇవాళ హాస్టళ్లలో పారిశుధ్య డ్రైవ్, రేపు విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్, 22న మౌలిక సదుపాయాలు, 23న పేరెంట్స్ మీటింగ్, 24న నైపుణ్యాభివృద్ధి, 25న సమ్మర్ క్యాంపులు, 26న బడి బాట కార్యక్రమం ఉంటుందన్నారు.