SKLM: నందిగాం మండలం సుబ్బమ్మపేటలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సోమవారం చందనోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కె. రంగనాథ్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిజరూప దర్శనం కల్పిస్తామని, అనంతరం చందనోత్సవం చేపడతామని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.