కోనసీమ: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆరవ రోజు అమలాపురం ఏరియా హాస్పిటల్, ఏఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగులకు విద్యుత్, LPG గ్యాస్ అగ్ని ప్రమాదాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. అగ్ని మాపక వారోత్సవాల కరపత్రం పంపిణీ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 101 అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయాలని ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు వివరించారు.