TG: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేయనున్నారు. సుమారు 45 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.5,653 కోట్లు నేరుగా జమకానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో సీఎం బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. కాగా, మార్చి 23న తొలి విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.