W.G: అపరిచిత వ్యక్తులకు, బ్యాచిలర్లకు ఇళ్లు ఇవ్వవద్దని ఎస్సై స్వామి సూచించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం పెంటపాడు అంగన్ వాడీ కేంద్రంలో నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చిన్నారులు కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకుండా శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలను మొబైల్స్‌కు దూరంగా ఉంచాలని, శారీరక ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.