వరంగల్ నగరంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ తరహా భారీ ఎగ్జిబిషన్‌ను కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆదివారం ప్రారంభించారు.వేసవిలో నగరవాసులకు వినోదం, ఉల్లాసం అందించేలా నయాగరా జలపాతం వంటి ప్రత్యేక ఆకర్షణలతో ఈ ఎగ్జిబిషన్‌ను రూపొందించారు. సాయంత్రం వేళల్లో కుటుంబాలతో గడపడానికి ఇది మంచి వేదికగా ఉంటుందని ఆయన తెలిపారు.