KMM: రుణమాఫీ అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీ మంత్రి హరీష్రావు సవాల్ విసిరారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వంద శాతం రుణమాఫీ కాలేదని, మీ నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వచ్చి నిరూపిస్తానన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.