BHPL: విద్యా హక్కు చట్టం-2009 (RTE) ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కల్పించాలని, ఫీజు దోపిడీని అరికట్టాలని మొగులపల్లి TRP మండల అధ్యక్షులు రాజేష్ పటేల్ అన్నారు. ఆదివారం రాత్రి చిట్యాల మండలంలోని పలు గ్రామాలను సందర్శించి మాట్లాడారు. పేదల భవిష్యత్తు కోసం TRP పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో TRP నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.