PPM: జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు 2026 సందర్భంగా ఆరో రోజు పాలకొండ అగ్నిమాపక ఆధ్వర్యంలో వీరఘట్టంలో ఉన్న కనోసా హాస్పిటల్లో విస్తృత స్థాయిలో మాక్ డ్రిల్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు పాల్గొనగా, ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మాక్ డ్రిల్ రూపంలో అవగాహన కల్పించారు.