ADB: ధాబాలో మద్యం సేవించిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నలుగురితోపాటు మద్యం సేవించడానికి అనుమతించిన యజమానిపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ ఫణిదర్ ఆదివారం తెలిపారు. ధాబాలలో మద్యం సేవించడానికి ఎలాంటి అనుమతులు లేవని సూచించారు. చట్ట వ్యతిరేకంగా ధాబాలలో మద్యం అమ్మిన, సేవించిన వారిపై సైతం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.