NZB: సిరికొండ మండలం గోప్య తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మంజుల సంతోష్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్య క్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, భుక్య రమేష్, సీఈఓ దేవిలాల్, శ్రీధర్, చందర్ నాయక్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.