TG: మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రతిపక్షాల తీరుపై ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కేవలం ప్రగాల్భాలు పలకడానికే పరిమితమైందని అన్నారు. ఇప్పటికైనా మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు.