HNK: హసన్ పర్తి మండలంలో వాట్సాప్ గ్రూప్లో పరస్పరం ఆరోపణలు చేసుకున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాసాగర్, వెంగళదాసు వేణు ‘హసన్ పర్తి బొడ్రాయి’ గ్రూప్లో మార్చి 26, 27 తేదీల్లో ఒకరినొకరు దూషించుకున్నారు. ఇరువురి ఫిర్యాదులపై మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు శనివారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు.