NRML: కడెం మండలంలోని ఉడుంపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దంతాలపల్లి నుండి కడెంవైపు వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.