NZB: సిరికొండ మండలం అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రశ్నించేందుకు వచ్చిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి సహా నాయకులను, రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని, లేదంటే ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.