MDK: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పనుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నందున రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్, మున్సిపాలిటీలు, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులను కేవలం హెల్ప్ డెస్క్ ద్వారానే స్వీకరిస్తామన్నారు.