HNK: జిల్లాలో నేతన్న భరోసా పథకం కింద 782 మంది చేనేత, అనుబంధ కార్మికులకు రూ. 24.06 లక్షలు మంజూరు చేసినట్లు చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎం. విజయలక్ష్మి తెలిపారు. DBT ద్వారా రెండు విడతల్లో నిధులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికుడికి ఏడాదికి రూ. 18 వేల వరకు, అనుబంధ కార్మికులకు రూ. 6 వేల వరకు సాయం లభించనుంది.